దళిత సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై మళ్లీ మత ఛాందసవాదులు దాడి

ఆ మధ్య రాముడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు మత ఛాందసవాదులు సంఘాల్లో కోపాన్ని పెంచేస్తున్నాయి. రాముడు మాంసం తింటాడని.. ఆయనకు జింక మాంసం అంటే ఇష్టమని ఈ మధ్యే కామెంట్ చేసారు కత్తి మహేష్. ఐమాక్స్‌కు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు వచ్చిన ఈయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. సినిమాకు వచ్చిన సంగతి తెలుసుకున్న కొందరు వ్యక్తులు బయట కత్తి కోసం కాచుకుని ఉన్నారు. ఆయన ఎక్కిన కారుపై దాడి చేసారు. దాంతో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఐమాక్స్‌కు చేరుకుని కత్తి మహేష్‌ను అక్కడ్నుంచి సేఫ్‌గా పంపించారు. అయితే కత్తి వచ్చిన విషయాన్ని తెలుసుకుని దాడి చేయడంతో అక్కడ కాసేపు వాతావరణం వేడెక్కింది. గతంలో కూడా ఓసారి కత్తిపై ఇలాగే దాడి జరిగింది. అప్పుడు కోడిగుడ్లతో ఈయనపై దాడి చేసారు. ఇప్పుడు మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.