ఉన్నావ్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న పదిహేడేళ్ల యువకుడు పోలీసుల చేతికి దెబ్బలతో మరణించాడు.

ఉన్నావ్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న పదిహేడేళ్ల యువకుడు పోలీసుల చేతికి దెబ్బలతో మరణించాడు.

వేలసంఖ్యలో వీధుల్లోకి వచ్చిన జనం.

నిందితులపై హత్యానేరం మీద కేసు దర్యాప్తు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో కూరగాయలు విక్రయం చేస్తున్న పదిహేడేళ్ల యువకుడు హుస్సేన్ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన చేశాడని పోలీసు కానిస్టేబుల్ విజయ్ చౌదరి, హోంగార్డు సత్యప్రకాశ్ అతన్ని తీవ్రంగా కొట్టి హింసించారు.

నమాజ్ చేసి వచ్చి తన ఇంటి దగ్గర కూరగాయలు విక్రయిస్తున్న ఫైజల్ హుస్సేన్నీ పోలీసులు పట్టుకొని, బంగరుమౌ కోత్వాల్ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు.

హుస్సేన్ సహోదరులు బంధువుల ప్రకారం పోలీసులు అతన్ని దారుణంగా కొట్టి హింసించారు.

అక్కడ అతని పరిస్థితి విషమించడంతో, పోలీసులు అతనిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలియజేశారు. ఆసుపత్రికి వెళ్లే వరకు అక్కడ వైద్యులు అతడు చనిపోయాడని వెల్లడించారు.

అతని బంధువులు పోలీసులు అతన్ని కొట్టి గాయపరచి చంపేశారని గొడవ చేశారు, చూస్తుండగానే వేల సంఖ్యలో జనం, అతని కుటుంబం తో పాటు బాలుడి భౌతిక దేహంతో గుమిగూడారు. నిందితులకు కఠిన చర్య తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని నిరసన చేశారు.

అక్కడికి పోలీసు అధికారులు చేరి దర్యాప్తు చేస్తామని పరిస్థితిని నెమ్మది పరిచే ప్రయత్నం చేశారు.

కానిస్టేబుల్ విజయ్ చౌదరి, సీమావత్, హోమ్ గార్డ్ సత్య ప్రకాష్ మీద హత్య నేరం దర్యాప్తు చేశారు.

ఇంటి పోషణ కొరకు పైసల్ చదువు మానేసి, 12 ఏళ్ల నుండి పని చేస్తుండేవాడిని కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.