గుజరాత్ లో పారిశుధ్య కార్మికులుగా అగ్రవర్ణాలవారు కావాలి అని ఒక NGO ఇచ్చిన ప్రకటన దుమ్ము రేపింది.

 ప్రకటన- కుల ప్రకంపన అహ్మదాబాద్: గుజరాత్ లోని ఒక స్వ్ఛంద సంస్థ ఇచ్చిన ప్రకటన కుల ప్రకంపనలు సృష్టిస్తోంది. అదేమిటంటే, పారిశుధ్య కార్మికుల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు ఒక NGO ఇచ్చిన ప్రకటన వైరల్ అవ్వడంతో ఆగ్రహానికి గురయ్యారు అగ్రవర్ణ ప్రజలు. విషయానికి వస్తే గుజరాత్, అహ్మదాబాద్ లోని ‘ హ్యూమన్ డెలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్‘ అనే దళితులు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడే NGO సంస్థ పారిశుధ్య కార్మికులు కావాలంటూ ఒక ప్రకటన ఇచ్చింది. అంతేకాకుండా ఆ ఖాళీలు కి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య , పటేల్, జైన్, సయ్యద్, పఠాన్, సిరియన్ క్రిస్టియన్, పార్సీ సామాజికవర్గాల ప్రజలకి అధిక ప్రాధన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వార్త వైరల్ అవ్వడంతో తో పైన చెప్పబడిన అగ్ర వర్ణాలుకి చెందిన బ్రహ్మో సమాజ్, పోలీస్ లోక్ సేవ రక్షక్ సమితి, NSUI, సున్నీ అవమీ ఫోరమ్, రాజ్పుత్ శౌర్య ఫౌండేషన్ కి చెందిన వారు ఆగ్రహంతో ఈ సంస్థ దగ్గర ఆందోళన చేపట్టారు. ఆ సంస్థ డైరెక్టర్, ప్రసాద్ చాకో సంతకం కూడా ఆ ప్రకటన కాపీ మీద ఉండటం తో మరింత అగ్రహనికి గురైనట్టు తెలుస్తుంది. డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎవరిని కించరపరచడం తమ ఉద్దేశం కాదని, స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అని, సామాజిక సమనతా దృక్పథంతో మాత్రమే ఈ ప్రకటన ఇచ్చినట్టు తెలిపారు. అయితే అగ్ర వర్ణాలు కి చెందిన వారు డిస్ట్రిక్ట్ కలెక్టర్, పోలీస్ లకు జోక్యం చేసుకోవాలని FIR దాఖలు చేశారు. దీని పై NGO సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ వారితో చర్చిస్తున్నమని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఇతర స్వచ్చంధ సంస్థలు తో పాటు కలెక్టర్ ను కూడా కలసి విషయం వివరిస్తామని చెప్పారు. 

Courtesy:  https://www.hindustantimes.com/india-news/gujarat-ngo-ad-seeks-sweepers-from-upper-castes-kicks-up-a-storm/story-0U0jvHEEH01EJq5uZZVQML.html 

Leave a Reply

Your email address will not be published.