Feb 14 దళిత దామొదరం సంజీవయ్య గారు 99 వ జయంతి
స్వర్గీయ దామొదరం సంజీవయ్య గారు మాజి ముఖ్యమంత్రి ఆంద్రప్రదేశ్ 99 వ జయంతి సందర్బంగా ఆయన గురించి
దామొదరం సంజీవయ్యగారు కర్నూలు జిల్లా వాసులు. కడు పేద దళిత కుటుంబములొ జన్మించారు ఆయనకు రాకీయాలమీద,చాల ఇంట్రెస్టు వుండేది మనకు ఉమ్మడి రాష్ర్టం మద్రాసు వున్నడు అక్కడ సివిల్ సప్లై కార్యాలంలొ ఉద్యోగం చేసాడు. తరువాత కాంగ్రెసు పార్టిలొ చేరి కేంద్రమంత్రిపదవులు చేపట్టాడు అలాగె అతి చిన్నవయసులోనె ఏఐసిసి ఆధ్యక్ష పదవులు చేపట్టి ఆ పదవిని సమగ్రంగా నిర్వహించి అన్నిరాష్ష్టాలొ బలోపేతం చేసాడు. 1962లొ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమింప పడ్డాడు. ఆయన రాష్ర్టఅభివ్రుద్ది కొరకు పరిశ్రమలు విస్తరింపజేసాడు తద్వార యువతకు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. సంక్సేమపధకాలను చేపట్టాడు. వ్రుద్యాప పెన్సన్లు కల్పించారు ,ఉద్యోగులకు డా. అంబేద్కర్ కాన్సెప్టుతొ బొనస్ ప్రారంబించాడు. బీసిలకు నియామాపకాల్లొ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాడు.
1969 లొ SC/St/bc and minorities employees (SCEWASTAMB) అనె సమస్తను ఢిల్లిలొ స్తాపించి ఈ నాలుగువర్గాలను ఒకతాటిపైకి తేవాలనె వుద్ధేశ్యంతొ ఆ సమస్తను ప్రారంబించాడు.
సంజీవయ్యగారు చాల నిజాయితిపరుడు అనేదాకి నిదర్షనం ఆయనకంటు ఒక ఇల్లు కూడ నిర్మించుకోలేదు.నిస్వార్దంతొ ప్రజలకు ఎన్నొ సేవలు అందించి రాష్ర్టాన్ని అభివ్రుద్దిపదంలొ నడిపించాడు.
మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. (బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా)
దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రు నిర్ణయం తీసుకున్నారు. అగ్ర కులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్ లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడు అని, లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రు కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ కూలంకుషం గా ఎరిగిన నెహ్రు వారి ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు. సరే, విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రు. కొంతకాలం పాటు ఆ నిర్ణయం వాయిదా పడ్డది.
అప్పుడు నెహ్రు తన ఆంతరంగిక మిత్రుడు అయిన ఓ నాయకుడిని ఆంద్ర వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు, నేటి ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ అయిన చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. అయినప్పటికీ, ప్రధాని ఆదేశం కావడం తో వెళ్లాల్సిందే అన్నారు ఆయన.
ఇద్దరూ కలిసి సంజీవయ్య గారి గ్రామం వెళ్లారు కారులో. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యి పై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగ గొట్టం తో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. “ఏమిటి ఇక్కడ ఆపారు?” ప్రశ్నించాడు నాయకుడు. “సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి” అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు.
చక్రపాణి ఆమెకు నమస్కరించి “అమ్మా…ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు” అన్నారు.
ఆమె చెమటలు తుడుచుకుంటూ “అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు? ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు” అన్నది.
నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. “సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?” అడిగారు చక్రపాణి. “అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి” అన్నాడు నాయకుడు.
ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తోలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు….
ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు మరి!!! మరిప్పుడో!!🤔