February 7 త్యాగాల తల్లి మాతా రామా భాయి అంబెడ్కర్ గారి జయంతి
నేడు (Feb 07), శ్రీమతి రమాబాయి అంబేడ్కర్ గారి జయంతి.
దళిత స్త్రీల జీవితానికి దర్పణం శ్రీమతి రమాబాయి అంబేడ్కర్ జీవితం.
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అయన సహధర్మచారిణి మాత రమాబాయి ని గుర్తు తెచ్చుకోవటం మన కనీస ధర్మం.
ఒక మహా ఉద్యమానికి, మొట్ట మొదట సాక్షి, అభిమాని, మద్దతు తెలిపిన వ్యక్తి.
1906 లో శ్రీ భికు వాలగ్కార్ కుమార్తె అయిన రమాబాయి డా.అంబేడ్కర్ ని వివాహం చేసుకున్నారు.
రమాబాయి చిన్నతనం లొనే తల్లిదండ్రులు మరణించటం తో బంధువులు తో బొంబాయి వచ్చేరు.
డా. అంబేడ్కర్ చదువు, ఉద్యమాలతో బిజీ గా ఉండటంతో కుటుంబ బారమంతా రమాబాయి చూసుకోవాల్సి వచ్చింది.
డా.అంబేడ్కర్ తండ్రి, మరియు సోదరుడు ఆనంద రావు మరణం కుటుంబ జీవితంలో ఆమెకు విషాదాన్ని నింపేయి.
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఉన్నత చదువులు చదవాలి అని ఆమెకు ఆశగా ఉండేది.
డా. అంబేడ్కర్ చదువులు కోసం లండన్ వెళ్ళేటప్పుడు తన పూర్తి సహకారం అందించేరు.
కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు జరిగిన ఆమె ఏరోజు చలించిపోలేదు, సమస్యలకు లొంగిపోలేదు. డా.అంబేడ్కర్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నారు.
రమాబాయి జీవితం ఎన్నో విషాదాలు చూసింది. నలుగురు పిల్లలు మరణం,భర్త ఎప్పుడూ ఇంటి పట్టున ఉండక పోవటం, సమాజం లో రాజకీయ ఉద్రిక్తలు ఆమెను ఆందోళనకు గురిచేసేయి. భర్త ఆరోగ్యం కోసం ప్రార్ధించేది.
డా.అంబేడ్కర్ కి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆమెకు
తెలియనిచ్చేవారు కాదు. ఆమె మరింత ఆందోళన చెందటం డా అంబేడ్కర్ కి ఇష్టముండేది కాదు. ఆమెకు దైవ భక్తి ఎక్కువ, ఎప్పుడూ ఉపవాస దీక్షలు చేసేవారు.డా.అంబేడ్కర్ ఎన్నిసార్లు చెప్పినా వినేవారు కాదు. పండరీనాధుడిని దర్శించాలి అనేది ఆమే చిరకాల కోరిక.
రమాబాయి అనారోగ్యం తో ఉన్నప్పుడు డా.అంబేడ్కర్ సానిత్యం కోరుకునేది.
ఊపిరిసలపని పనులతో ఆరోగ్యం క్షీణిస్తున్న డా అంబేడ్కర్ నిమ్న జాతుల కోసం అహిర్నిశలు శ్రమిస్తుంటే ఆమెకు చిరాకు కల్గించేది. డా.అంబేడ్కర్ తనకు దూరం అవుతున్నాడు అని ఆందోళన చెందేది.
ఒక్కొక్కసారి డా అంబేడ్కర్ ని వెంటనే చూడాలి అని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ సభ ఎక్కడ ఉందొ అక్కడకి వెళ్ళేవారు.
పరిసరాలు మారితే మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఏమో అని డా.అంబేడ్కర్ అప్పుడు అప్పుడు పక్క ఊర్లకి పంపేవాడు. పూనా ఒప్పందం మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నా, గాలి మార్పు కోసం ఆమెను ధార్వార్ తీసుకు వెళ్ళేరు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు.
రమాబాయి కి ఉన్నా చిరకాల మానసిక వేదన ఆమెను కొలుకోలేకుండా చేసింది. ఆమె చివర గడియలలో ఉన్నప్పుడు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఆమె చెంతనే ఉన్నాడు.
మే 26, 1935 డా.అంబేడ్కర్ సన్నిధిలో ఆమె కన్ను మూసింది.అప్పటికి వారు దాదార్ హిందూ కాలనీలో ఉండేవారు. అంత్యక్రియలకు దాదాపుగా 10వేల మంది హాజరు అయ్యేరు.
కుటుంబం లో ఏ కష్టం రాకుండా నడిపిన భార్య అంటే అమితమైన గౌరవం, ప్రేమ అంబెడ్కర్ కి. అందుకే అయిన రాసిన The thoughts of Pakistan అనే పుస్తకాన్ని ఆమె కు అంకితం చేసేరు బాబాసాహెబ్ డా అంబేడ్కర్.
కోట్లాది ప్రజల హక్కులు కోసం Dr BR అంబెడ్కర్ గారు చేసిన పోరాటాలకి ఏ మాత్రం ఆటంకం కలిగించ కుండా పిడకలు అమ్మీ కుటుంబాన్ని పోషించి,, అన్ని విధాలా అంబెడ్కర్ గారికి అండగా ఉండి ఎంతో కఠినమైన పేదరికాన్ని అనుభవించి ,, తన బిడ్డల అనారోగ్యానికి మందులు కొనటానికి డబ్బులు లేక,, వైద్యం ఇప్పించలేక తన ముగ్గురు కొడుకులను,, కన్నా ఒక్క కుమార్తెను కోల్పయి తను కూడా అనారోగ్యంతో వైద్యానికి డబ్బులు లేక చనిపోతూ…..
చావులు నాకు కొత్త కాదు ఇప్పటికే ముగ్గురు కొడుకులను ఒక కుమార్తెను కోల్పోయాను. నా ఆరోగ్యం కూడా క్షీణించింది కనీసం మిగిలిన ఒక్క కుమారుడనైన మంచిగా చూడు అని తన భర్త Dr BR అంబెడ్కర్ గారికి LETTER వ్రాసి ప్రాణాలు విడిచిన త్యాగాల తల్లి మాతా రమాబాయి 122 వ జయంతి సందర్బంగా అందరికీ
ఒక రోజు అంబేడ్కర్ గారు చదువులు ముగించుకుని లండన్ నుండి ఇండియాకు ఓడలో బయలుదేరి వస్తున్నారు.
చాలా మంది ఆయన అభిమానులు కలిసి కరాచాలనం చేసి సన్మానించాలని ఓడరేవు దగ్గర ఎదురు చూస్తున్నారు.
ఒక దళితుడు ఉన్నత చదువులు చదివి గొప్పవాడయ్యాడని లండన్ లో తను బ్రతకడానికి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ దేశం కోసం అన్ని వదులుకుని మా జాతి కోసం వస్తున్నాడని అక్కడికి వచ్చిన వారందరిలో లోపల భావోద్వేగానికి లోనవుతూ సన్నటి కన్నీటి దారాలతో ఎదురు చూస్తున్నారు.
అభిమానులే అంత ఆనందానికి ఫీల్ అవుతే మరి అంబేడ్కర్ గారి సతీమణి అమ్మ రమాబాయి ఎంత ఫీల్ కావాలి.
అమ్మ రమాబాయి గారు కూడా తన భర్తను సన్మానించే కార్యక్రమ చూడాలని ఎంతో ఆశతో తన భర్తను ఇంతకు మునుపు సన్మానించిన శాలువా కప్పుకుని ఓడరేవు దగ్గరికి బయలుదేరింది.
ఎంతో ఆశతో వెళ్ళిన రామాబాయి గారిని చూసి అక్కడవారు రమాబాయి మండుటెండలో శాలువా కప్పుకుని రావడం వారికి నచ్చక ఒకింత కోపంగా చూడటం అమ్మ గమనించింది అయినా సరే తన భర్తను సన్మానించే కార్యక్రమాన్ని చూడాలని అవన్నీ పట్టించుకోలేదు.
కాసేపటికి అంబేడ్కర్ గారు రావడం ఆయనను సన్మానిచడం అన్ని జరిగిపోయాయి.
ఇంటికి వెళ్తూ అంబేడ్కర్ గారు రమాబాయినీ సున్నితంగా ఇంత మండుటెండలో శాలువా కప్పుకుని రావడం అవసరమా అని అడిగాడు.
అప్పుడు అమ్మ గారు తన కళ్ళల్లో కారుతున్నా నీళ్లను తుడుచుకుంటూ ఉన్న ఒక్క జాకెట్టు కుట్ల మీద కుట్లు వేయడం వల్ల కుట్లు వేయడానికి కూడా పనికి రాకుండా పోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మిమ్మల్ని చూడాలని ఆశ నన్ను వేధిస్తుంది జాకెట్టు చిరిగిపోయి బయటికి రాలేక ఆలోచిస్తుంటే ట్రంకు పెట్టాలో మీకు సన్మానించిన శాలువా ఉందని తెలిసి దాన్ని తీసి కప్పుకుని వచ్చానండి అని తల వంచుకుని చెప్పింది.
అంబేడ్కర్ గారు రమాబాయి గారిని దగ్గరకు తీసుకుని నేను చాలా అదృష్టవంతున్ని నీలాంటి భార్య లభించడం అంటూ ఆమె కళ్ళల్లో నీళ్ళు తుడుస్తూ చెప్పాడు.
అక్కడ ఆ సన్నివేశం చూసి అందరూ మేము అపార్థం చేసుకున్నందుకు మన్నించమని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు.