చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు దళిత గుడిపాటి రాజ్‌ కుమార్ కన్నుమూత…

టాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది… మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గుడిపాటి రాజ్‌ కుమార్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం రాజ్‌కుమార్ మృతిచెందారు. చిరంజీవితో పాటు.. రాజ్‌కుమార్‌కు కూడా పునాదిరాళ్లు తొలి సినిమా.. మొదటి  సినిమాకే ఏకంగా ఐదు నంది అవార్డులు దక్కాయి. అటు దర్శకుడిగా.. మరోవైపు నిర్మాతగా చిత్రాలను నిర్మించిన రాజ్ కుమార్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజ్‌కుమార్‌కు ఈ మధ్యే అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు చిరంజీవి. మరోవైపు, ఈ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు. రాజ్ కుమార్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

November 15 2019 Vaartha

మెగాస్టార్ తొలి ద‌ర్శ‌కుడు.. సాయం కోసం చేతులు చాస్తున్నాడు..!

ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లుగా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్‌గా చిరంజీవి ఎద‌గ‌డానికి తొలిమెట్టు ఎక్కేద‌శ‌లో దిశ‌ను చూపి.. సినిమాలో హీరోగా అవ‌కాశం ఇచ్చిన తొలి ద‌ర్శ‌కుడు మాత్రం ఇప్పుడు చివ‌రి ద‌శ‌లో ఆప‌న్న హ‌స్తం కోసం చేతులు చాపుతున్నాడు.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన మెగాస్టార్‌కు హీరోగా అవ‌కాశం ఇచ్చిన ఆ ద‌ర్శ‌కుడు ఇప్పుడు త‌న‌కు చివ‌రి ద‌శ‌లో ఎవ్వ‌రు బ‌తికే అవ‌కాశం ఇస్తారో అని ఎదురు చూస్తున్నాడు. ఇంత‌కు ఎవ‌రా ద‌ర్శ‌కుడు అనుకుంటున్నారా.

మెగాస్టార్‌ చిరంజీవి తొలిచిత్రం పునాదిరాళ్లు దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ (75) కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపన్న హస్త కోసం ఎదురుచూస్తున్నారు. తొలి సినిమాతోనే 5 నంది అవార్డులు అందుకొని రాజ్‌కుమార్‌ ఘనత సాధించారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ సామాజిక ఇతివృత్తాలే కావడం విశేషం. సామాజిక కోణంలో నిర్మించిన ఆ చిత్రాలతో ఎక్కడికో ఎదగాల్సిన ఆయనకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి.

Leave a Reply

Your email address will not be published.